భరత్ వచ్చాడయ్యో సామి సాంగ్ టీజర్

VACHADAYYOకొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే సినిమాలోని ఒక్కో సాంగ్ టీజర్ ని రిలీజ్ చేస్తున్న యూనిట్..మంగళవారం (ఏప్రిల్-17) మరో సాంగ్ టీజర్ ని విడుదల చేసింది. వచ్చాడయ్యో సామి అనే వీడియో సాంగ్ టీజర్ ని ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడే హీరో మహేష్. ఈ సినిమాలోని తనకిష్టమైన మరో సాంగ్ అని ట్విట్ చేశాడు మహేష్. 40 సెకన్లున్న ఈ వీడియో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates