భర్తతో గొడవ…పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకున్న భార్య

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్సురాబాద్‌లో ఓ విషాద సంఘటన జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మన్సురాబాద్‌లోని వీకర్‌ సెక్షన్‌ కాలనీలో నివాసం ఉంటున్న స్రవంతి భర్తతో గొడవపడ్డది. దీంతో మనస్తాపానికి గురైన స్రవంతి ఇవాళ(శుక్రవారం) ఇంట్లో ఉన్న విద్యుత్‌ వైర్లను పట్టుకుంది. అలాగే పిల్లల్ని కూడా తనతో పాటు పట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌కు గురై ఆమెతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. తల్లితోపాటు కుమారుడు సాయితేజ్‌(10), కూతురు చిట్టి కూడా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates