భర్త ఆచూకీ కోసం హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన మెడికల్ ఆఫీసర్

మూడేళ్లుగా ఇంటికి వస్తలేడని ఫిర్యాదు

నాంపల్లి,వెలుగు: తన భర్త వేరే మహిళతో ఉంటూ మూడేళ్లుగా ఇంటికి రావడం లేదని ఓ మెడికల్ ఆఫీసర్ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ ఆర్ సీ)ని ఆశ్రయించింది. ఆర్మూర్​కి చెందిన డా.సలంద్రకు మోహన్ బాబుతో 20 ఏండ్ల క్రితం పెళ్లైంది. సలంద్ర ప్రస్తుతం బోధన్ లో డిప్యూటీ డీఎంహెచ్ వో గా పనిచేస్తోంది. చెడు వ్యసనాలకు బానిసైన మోహన్ బాబు తనను  వేధించేవాడని సలంద్ర హెచ్ ఆర్ సీకి ఇచ్చిన కంప్లయింట్ లో పేర్కొంది. మూడేళ్లుగా ఇంటికి రావట్లేదని  గతంలో పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని ఆమె కమిషన్ ను కోరింది.

ఇవి కూడా చదవండి

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ

Latest Updates