భలే ఆఫర్ : షియోమి ఫోన్ ఉంటే.. లక్ష అప్పు ఇస్తారు

XIరైస్ కుక్కర్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ బైక్ వరకూ, స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీ వరకూ ఇలా అన్నింటిలో అడుగుపెట్టింది చైనా దిగ్గజ కంపెనీ షియోమి. ఇప్పటి వరకూ బడ్జెట్ ధరలతో గూడ్స్ ని అందిస్తూ ప్రజలకు చేరువైన షియోమి ఇప్పుడు తమ వినియోదారుల ముందు మరో బంఫరాఫర్ పెట్టింది. ఏ బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే యూజర్లు లక్ష రూపాయలను పర్సనల్ లోన్ గా ఇచ్చేందుకు షియోమి రంగం సిద్దం చేసింది. బెంగళూరుకి చెందిన క్రెజిబీ అనే ఫిన్ టెక్ సంస్ధతో కలసి MI క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్టును షియోమి ప్రారంభించింది. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. రూ.వెయ్యి నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఈ ప్రాజెక్టులో భాగంగా షియోమి మొబైల్ ఫోన్ యూజర్లు అప్పుగా అందుకోనున్నారు.

అప్పుకి ఎలా అప్లయి చేసుకోవాలి :

… షియోమి స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా MI క్రెడిట్ సర్వీస్‌ లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.

… నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి

… 10 నిమిషాల్లో లోన్‌ కు అర్హులా.. కాదా అన్న మెసేజ్ మనకు వస్తుంది

… లోన్‌ కు అర్హులైన వారు తమకు కావాల్సిన మొత్తాన్ని ఎంపిక చేసుకుని 15 నుంచి 90 రోజుల వరకు వాయిదా పెట్టుకోవాలి. 3 శాతం వడ్డీతో ఈ లోన్ ఉంటుందని షియోమి తెలిపింది.

దేశంలోని మొబైల్ రంగంలో ఇప్పటికే షియోమి తన ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇటీవలే టీవీలు కూడా విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. భారతదేశం మాకు అత్యంత విలువైన మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తుందంటూ కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వినియోగదారులు కంపెనీతో మరింత దగ్గర అయ్యేందుకు ఈ క్రెడిట్ స్కీమ్ పనికొస్తుందని భావిస్తోంది కంపెనీ.

 

Posted in Uncategorized

Latest Updates