భలే గిరాకీ : నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్

DWo_mv8V4AAK69dస్మార్ట్‌ఫోన్లతో కస్టమర్ల గుండెల్లో దడ పుట్టించిన షియోమీ.. ఇపుడిక టీవీ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి భారత్‌లో తొలిసారిగా MI -LED  స్మార్ట్‌ టీవీ 4 సేల్స్ ను గురువారం (ఫిబ్రవరి-22)న ప్రారంభించింది. అద్భుత ఫీచర్లతో లాంచ్‌ చేసిన MI స్మార్ట్‌ టీవీని ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో తొలి ఫ్లాష్‌ సేల్‌కు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే అవుటాఫ్‌ స్టాక్‌ అయ్యింది. అయితే ఎన్ని యూనిట్లు విక్రమయ్యాయో కంపెనీ వెల్లడించలేదు. నిమిషాల్లోనే అవుటాఫ్‌ స్టాక్‌ అయిన ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4 తర్వాతి సేల్‌ ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎంఐ.కామ్‌లో మాత్రమే తర్వాత సేల్‌ తేదీ ప్రకటించగా..ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడిచంలేదు. నిమిషాల్లోనే అవుటాఫ్‌ స్టాక్‌ అవడంపై, కస్టమర్లు తీవ్ర నిరాశవ్యక్తంచేస్తున్నారు.

LED స్మార్ట్‌ టీవీ 4 ఫీచర్లు

4.9 ఎంఎం అల్ట్రా–థిన్‌ ఫ్రేమ్‌లెస్‌ డిజైన్
55 ఇంచెసక LED  డిస్‌ప్లే ప్యానెల్
4కే రెజల్యూషన్‌ (3840×2160 పిక్సెల్స్‌)
HDR సపోర్ట్, 64 బిట్‌ 1.8 గిగాహెర్జ్ట్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్
2 GB ర్యామ్, 8 జీబీ మెమరీ

Posted in Uncategorized

Latest Updates