భలే ఛాన్సులే : 50 లక్షల స్మార్ట్ ఫోన్లు ఫ్రీ

smart-phonesస్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం 4, 5వేల రూపాయలు కావాలి. అలాంటి ఫోన్ ఉచితంగా ఇస్తామంటే ఎగిరి గంతేస్తాం కదా.. ఇప్పుడు చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఇలాగే చేస్తోంది. 50 లక్షల మందికి ఉచితం స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. సంచార్ క్రాంతి పథకం కింద ఈ స్కీమ్ అమలు చేయబోతున్నారు. మే మొదటి వారంలో సీఎం రమణసింగ్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వికాస్ యాత్ర క్యాంపెయిన్ పేరుతో గ్రామ సభలు నిర్వహించి స్మార్ట్ ఫోన్ల పంపిణీ జరగనుంది. మొదటి విడతలో 30 లక్షలు, రెండో విడతలో 20 లక్షల ఫోన్లు పంపిణీకి రంగం సిద్ధం అయ్యింది.

స్మార్ట్ ఫోన్ ఉచితంగా పొందటానికి కొన్ని అర్హతలు కూడా నిర్ణయించారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లోని పేద మహిళలకు 40 లక్షల ఫోన్లు అందిచనున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న కాలేజీ విద్యార్థులకు 5 లక్షల ఫోన్లు పంపిణీ జరగనుంది. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మొబైల్ ఫోన్ కనెక్టివిటీ 29శాతంగా ఉంది. ఉచితం స్మార్ట్ ఫోన్ల పంపిణీ వల్ల కొత్తగా 13వేల 900 గ్రామాలకి మొబైల్ కనెక్షన్ విస్తరిస్తుందని చెబుతున్నారు. ఫోన్ల క్వాలిటీ విషయంలో రాజీ లేదని.. నాణ్యమైన మంచి ఫోన్లు అందించనున్నట్లు ప్రకటించింది చత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఈ స్మార్ట్ ఫోన్లను ఛత్తీస్ ఘడ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ రంగం సిద్ధం చేశారు. ఏమైనా భలే ఛాన్స్ కదా.. ఈ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రజా సమాచారం ఉచితంగా అందించవచ్చని నిర్ణయించారు.

 

Posted in Uncategorized

Latest Updates