స్మార్ట్ ఫోన్ ఉచితంగా పొందటానికి కొన్ని అర్హతలు కూడా నిర్ణయించారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లోని పేద మహిళలకు 40 లక్షల ఫోన్లు అందిచనున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న కాలేజీ విద్యార్థులకు 5 లక్షల ఫోన్లు పంపిణీ జరగనుంది. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మొబైల్ ఫోన్ కనెక్టివిటీ 29శాతంగా ఉంది. ఉచితం స్మార్ట్ ఫోన్ల పంపిణీ వల్ల కొత్తగా 13వేల 900 గ్రామాలకి మొబైల్ కనెక్షన్ విస్తరిస్తుందని చెబుతున్నారు. ఫోన్ల క్వాలిటీ విషయంలో రాజీ లేదని.. నాణ్యమైన మంచి ఫోన్లు అందించనున్నట్లు ప్రకటించింది చత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఈ స్మార్ట్ ఫోన్లను ఛత్తీస్ ఘడ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ రంగం సిద్ధం చేశారు. ఏమైనా భలే ఛాన్స్ కదా.. ఈ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రజా సమాచారం ఉచితంగా అందించవచ్చని నిర్ణయించారు.