భలే వింత : సూది రంధ్రంలో కేసీఆర్

vidyadharసీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని సూక్ష్మ కళాకారుడు డాక్టర్‌ ముంజంపల్లి విద్యాధర్‌ సూది రంధ్రంలో ఇమిడే ఆయన బంగారు విగ్రహాన్ని తయారుచేశారు. నగరంలోని హస్తినాపురంనకు చెందిన విద్యాధర్‌ 14 మిల్లీ గ్రాముల బంగారంతో వారం రోజులు శ్రమించి సూది రంధ్రంలో ఇమిడే కేసీఆర్‌ బంగారు విగ్రహాన్ని రూపొందించారు. గతంలో తల వెంట్రుకపై ‘జై కేసీఆర్‌… జై తెలంగాణ’ అని రాసి కేసీఆర్‌కు బహూకరించి ఆయన ప్రశంసలు అందుకున్నారు విద్యాధర్‌.

 

Posted in Uncategorized

Latest Updates