భాగ్యనగరం మొదటి బస్ డిపో : కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్ షెడ్

gowliguda-bus-depotఅక్షరాల వంద సంవత్సరాలకు పైగా ప్రయాణీకుల ప్రాంగణంగా సేవలందించిన గౌలిగూడ బస్టాండ్ షెడ్ కుప్పకూలింది. పట్టీలు తుప్పు పట్టటం.. సరైన మరమ్మతులు లేకపోవటంతో కుంగిపోయింది. అర్ధ చంద్రాకారంలో, రేకులతో నిర్మించిన బస్టాండు.. ప్రత్యేక ఆకృతిలో ఆకట్టుకుంటుంది. నిజాం కాలంలో గౌలిగూడ బస్టాండ్ ను నిర్మించారు. మొదట గిడ్డంగి కోసం నిర్మించిన కట్టడాన్ని.. తర్వాత స్టేట్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు. కొన్ని దశాబ్దాలపాటు.. హైదరాబాద్ కు ప్రధాన బస్టాండ్ గా వెలుగొందింది.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు గౌలిగూడ నుంచే బస్సులు నడిచాయి. 1994లో MGBS కట్టటంతో.. జిల్లాల బస్సులను అక్కడి నుంచే నడుపుతున్నారు. ప్రస్తుతం సిటీ బస్సులు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి.  కొంత కాలంగా మ్యూజియంగా మార్చాలని, CNG బస్సులకు కేటాయించాలని లేదా బస్టాండు కూల్చి భారీ నిర్మాణం చేయాలని అన్నో ప్రతిపాదనలు వచ్చాయి. రోడ్డు వెడల్పు కోసం కూల్చేస్తారనే ప్రచారం జరిగింది. అయినా కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేకపోవటంతో ప్రస్తుతం వెనుక వైపు నుంచి కుప్పకూలింది.

జూలై 5వ తేదీ గురువారం తెల్లవారుజామున బస్టాండ్ షెడ్ పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా కూలిపోయింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పాట్ కు వచ్చారు. షెడ్ ను తొలగించటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. 10 రోజుల్లో తొలగింపు పూర్తయ్యే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates