భానుమతి రోల్ లో భాగమతి

bnumathiఅందాల నటి సావిత్రి జీవితాధారంగా  నిర్మిస్తున్న సినిమా ‘మహానటి’. ఈ మూవీలో కీర్తి సురేశ్‌ లీడ్ రోల్ లో నటిస్తుండగా..సమంత జర్నలిస్ట్‌ పాత్ర లో కనిపించనుంది. అయితే ఇదే సినిమాలో అలనాటి నటి భానుమతి పాత్రలో టాలీవుడ్ బ్యూటీ అనుష్క నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు చేసిన వారిలో భానుమతి ఒకరు. అయితే ఆమె రోల్ కు అనుష్క అయితే పక్కాగా షూట్ అవుతుందని భావించిన టీం..అనుష్కను ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, ప్రకాశ్‌ రాజ్, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates