భారం కాదు : హెల్మెట్ బరువు తగ్గించండి

హెల్మెట్.. ఇది లేనిదే బండి బయటకు తీయలేం. తీస్తే చలానా కట్టాల్సిందే. బండికి తాళం ఎంత ముఖ్యమో.. హెల్మెట్ అంత. అయితే హెల్మెట్ బరువుపై చాలా రోజులుగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల తల, మెడ నొప్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు కూడా వచ్చాయి. దీనిపై స్పందించింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థ. హెల్మెట్ల తయారీ కంపెనీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి హెల్మెట్ బరువు కిలో 200 గ్రాములకు మించకూడదని ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం హెల్మెట్ బరువు కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు ఉన్నాయి. కనీసం 300 గ్రాములు తగ్గించాలని.. 1.2కిలోలకు తగ్గించాలని ఆదేశించింది. కొత్త హెల్మెట్లు 2019 జనవరి నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉండాలని కూడా సూచించింది. నాణ్యత విషయంలో రాజీపడకుండా.. బరువు తగ్గే విధంగా చూడాలని కూడా స్పష్టం చేసింది. అదే విధంగా ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు కూడా హెల్మెట్ల ఉత్పత్తిని ప్రారంభించాలని కోరింది. కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో హెల్మెట్ కూడా అందజేయాలని సూచించింది.

Posted in Uncategorized

Latest Updates