భారతీయ తొలి మహిళా డాక్టర్ ఆనందీకి గూగుల్ నివాళి

doodభారతీయ మొదటి మహిళా డాక్టర్ ఆనందీ గోపాల్ జోషి 153వ పుట్టిన రోజు(మార్చి 31) సందర్భంగా ఆమెకు గూగుల్ నివాలర్పించింది. ఓ చేతిలో డిగ్రీ పట్టుకుని, మెడలో సెతస్కోప్ పెట్టుకుని ఉన్న ఆనందీ ఫొటోను తన డూడుల్ లో గూగుల్ ఈ రోజు పెట్టింది.

మహారాష్ట్రలో 1865లో ఆనందీ జన్మించింది. ఆమె అసలు పేరు యమున. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన గోపాల్ రావు జోషితో.. ఆమెకు 9 ఏళ్ల వయసులో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత ఆనందీగా పేరు మార్చుకుంది. ఆనందీకి 14 ఏళ్ల వయసులో కుమారుడు పుట్టాడు. అయితే సరైన వైద్యం అందక ఆ బాబు చనిపోయాడు. దీంతో తన కొడుకుకి పట్టిన దుస్ధితి మరొకరికి రాకుండా చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీంతో 16 ఏళ్ల వయసులో ఆమె వైద్య విద్య చదవాలని నిర్ణయించుకున్నది.

డాక్టర్ చదవాలనే పట్టుదలతో అమెరికా వెళ్లింది. పెన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజీలో మెడిసన్ లో డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత ఓ మెడికల్ కాలేజీని ప్రారంభించాలన్న ఆశయం భారత్ కు తిరిగి వచ్చింది. అయితే ట్యూబర్ క్యులోసిస్ తో 22 ఏళ్ల వయసులోనే చనిపోయింది ఆనందీ. అయితే ఆమె ఆశయాలు మాత్రం చనిపోలేదు. తమ కలలు సాకారం చేసుకోవాలని అమ్మాయిలకు ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.  ఆమె వారసత్వం, మహిళలకు ఆమె చూపించిన మార్గం ఈ రోజుకి మార్గదర్శకం అంటూ తన బ్లాగ్ లో గూగూల్ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates