భారతీయ వంటకాలు కావాలి: కోహ్లీ సేనకు ఫుడ్ ప్రాబ్లమ్స్

Virat-Kohliదక్షిణాఫ్రికా వంటకాలపై అసృంతృప్తి వ్యక్తం చేసింది టీమ్ ఇండియా. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీం ఇండియా ఈ వంటకాలు మేం తినలేమని, మాకు భారతీయ వంటకాలు కావాలని కోరింది. దీంతో భారతీయ రెస్టారెంట్‌ నుంచి ఫుడ్‌ తెప్పించే ఏర్పాటు చేసింది దక్షిణాఫ్రికా బోర్డు. ఇన్ని రోజులు ఇరు జట్లకు ఒకే క్యాటర్స్‌ ఆహారం అందించింది. అయతే కోహ్లి సేన భారతీయ ఫుడ్‌ ఇష్టపడటంతో ప్రిటోరియాలోని భారత్‌కు చెందిన గీత్‌ రెస్టారెంట్‌ నుంచి రుచికరమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టింది. ‘లోకల్‌ క్యాటర్‌ అందిస్తున్న ఫుడ్‌పై భారత ఆటగాళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో దక్షిణాఫ్రికా బోర్డు మా రెస్టారెంట్‌ను ఎంపిక చేసింది. మా ఆహారాన్ని వాళ్లు ఇష్టపడుతున్నారు. కేవలం భారత ఆటగాళ్ల, సిబ్బందికి మాత్రమే మా హోటల్‌ ఆహారాన్ని అందిస్తున్నాం’ అని రెస్టారెంట్‌ మేనేజర్‌ తెలిపారు. మిగతా వేడుకల్లో స్థానిక చెఫ్‌లను కాకుండా భారతీయ చెఫ్‌లను ఉపయోగిస్తున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డ్‌ తెలిపింది. వన్డేలో అధ్భుత విజయం తర్వాత ఈ రోజు(ఫిబ్రవరి18) జరుగబోయే మొదటి టీ20 కి టీమ్ ఇండియా సిద్దమైంది.

Posted in Uncategorized

Latest Updates