భారత్ కి గ్రీవెన్స్ ఆఫీసర్ ని నియమించిన వాట్సాప్

భారత్ లో గ్రీవెన్స్ ఆఫీసర్‌ ను నియమించింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. యూజర్లు ఫేక్ న్యూస్ గురించి ఏవిధంగా కంప్లెయింట్ చేయాలో కూడా వివరించింది. గుంపు హత్యలకు దారి తీస్తోన్న ఫేక్ న్యూస్, వదంతులకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఒత్తిడికి స్పందించిన వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రభుత్వ కీలక డిమాండ్లలో ఒకటి నెరవేరినట్లయింది.
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ వెబ్‌ సైట్‌ ను గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియాతో అప్‌ డేట్ చేశారు. యూజర్లు మొబైల్ యాప్ ద్వారా లేదా ఈ-మెయిల్ లేదా లిఖితపూర్వకంగా గ్రీవెన్స్ అధికారి కోమల్ లాహిరికి కంప్లెయింట్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చునని వాట్సాప్ తెలిపింది. కోమల్ లాహిరి వాట్సాప్ గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్ అండ్ లోకలైజేషన్ సీనియర్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates