భారత్ కు అఫ్గాన్ షాక్ : “టై”గా ముగిసిన మ్యాచ్

క్రికెట్ లో ఏ టీమ్ ను తక్కువ అంచనా వేయరాదని మరోసారి ఫ్రూవ్ చేసింది అఫ్ఘాన్. మంగళవారం (సెప్టెంబర్-25) దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ కు ఊహించిన షాక్ ఇచ్చింది అఫ్గాన్. పసికూన..చిన్నదేశం అనే మాటలను పటాపంచలు చేసింది అఫ్గాన్. టాస్‌ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. షహజాద్‌ (116) సెంచరీకి తోడు.. మొహమ్మద్‌ నబీ (56) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో అఫ్గాన్ బిగ్ స్కోర్ చేసింది.

భారత బౌలర్లలో జడేజాకు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ KL రాహుల్‌ (66), అంబటి రాయుడు ( 57) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు ఫస్ట్ వికెట్‌ కు 110 రన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇండియా విక్టరీ కన్ఫమ్ అనుకున్నారు. కానీ..ఊహించని రీతిలో వికెట్లను కోల్పోయింది భారత్. లాస్ట్ ఓవర్లో విక్టరీకి భారత్‌ కు 7 రన్స్ కావాలి. జడేజా క్రీజ్‌ లో ఉన్నాడు. నాలుగు బాల్స్ తర్వాత స్కోర్లు ఈక్వల్ అయ్యియి. మరో రెండు బాల్స్ లో సింగిల్‌ తీయాల్సి ఉండగా.. జడేజా బాల్ ని గాల్లోకి లేపాడు. అంతే… ఆ క్యాచ్‌ తో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.

పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్‌ బౌలింగ్, బ్యాటింగ్ తో భారత ప్లేయర్లకు చుక్కలుచూపించారు. . ఐదుగురు కీలక ప్లేయర్స్ రెస్ట్ ఇచ్చిన భారత్‌ ఈ మ్యాచ్‌ లో ఓటమికి చేరువగా వచ్చి.. చివరకు బయటపడింది. మన టీమ్ గెలవాల్సిన మ్యాచ్‌ ను చేజార్చుకోగా… ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్‌ సగర్వంగా ఆసియా కప్‌ నుంచి తిరుగు ముఖం పట్టింది. నేడు జరిగే చివరి సూపర్‌–4 మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ తో బంగ్లాదేశ్‌ ఆడుతోంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన టీమ్.. శుక్రవారం (సెప్టెంబర్-28)జరిగే ఫైనల్లో భారత్‌ తో మ్యాచ్ ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates