భారత్ కు ట్రంప్ వార్నింగ్ : నాతో పెట్టుకుంటే మీ వెహికల్స్ తిరగవు

harley-davidsonభారత్ వ్యవహార శైలిపై మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హార్లీ–డేవిడ్‌సన్‌ బైక్‌లపై దిగుమతి సుంకం విషయంలో భారత్‌ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. స్టీల్‌ పరిశ్రమపై కాంగ్రెస్‌ సభ్యుల బృందంతో సమావేశం సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా దిగుమతి చేసుకుంటున్న వేల కొద్ది భారత మోటర్‌ సైకిళ్లపైనా దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేందుకు  వెనకాడబోమని వార్నింగ్ తెలిపారు. అమెరికాలో తయారు అయ్యి.. ఇండియాలో మార్కెట్ అయ్యే వాహనాలపై పన్నులు విధించటం ఏంటని ప్రశ్నించారు ట్రంప్. ప్రస్తుతంలో భారత్ లో హార్లీ డేవిడ్ సన్ బైక్స్ పై 50శాతం విదేశీ సుంకం విధిస్తున్నారు.

భారత్‌ నుంచి అమెరికా వెళుతున్న వాహనాలపై.. అమెరికా పన్ను వసూలు చేయటం లేదు. ఈ విషయాన్ని మరిచిపోవద్దని గుర్తు చేశారు ట్రంప్. అమెరికా అవలంభిస్తోన్న విధానాన్నే భారత్ కొనసాగిస్తే మంచిందని సూచించారు. ఇదే విధానాన్ని భారత్‌ కొనసాగించాలన్నారు. ‘చాలా దేశాల్లో అమెరికా వస్తువులు తయారవుతున్నాయి. అందుకోసం వారికి భారీగానే చెల్లింపులు చేస్తున్నాం.. అటువంటిది మన దగ్గర తయారైన హార్లీ డేవిడ్‌సన్‌ వారి దగ్గరికెళ్లినా భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తోంది అని ట్రంప్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates