భారత్ ఘనవిజయం: సఫారీలను చిత్తు చేసిన స్పిన్నర్లు

india-wonసెంచూరియన్ లో సౌతాఫ్రికా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని దూకుడుగా చేధించింది. 20.3 ఓవర్లలో 119 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ బ్యాట్స్ మెన్లు ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. శిఖర్ ధావన్ 51, కెప్టెన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 5వన్డేల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది.

సౌతాఫ్రికా బౌలర్ రబడ ఒక వికెట్ తీసుకున్నాడు.

సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు హసీమ్ అమ్లా 23, డికాక్ 20, డుమిని 25, జొన్డో 25, మార్కరమ్ 8 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్లలో ముగ్గురు డకౌట్లు అయ్యారు. మరో ఇద్దరు ఒక్కొక్క పరుగులు చేశారు.

భారత బౌలర్ చాహల్ ఈ వన్డేలో 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ 3వికెట్లు, భువనేశ్వర్ కుమార్, బుమ్రాలు చెరో వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates