భారత్-పాక్ ల సత్సంబంధాల కోసం యువత కృషి చేయాలి : అక్తర్

saకశ్మీర్ అంశంలో భారత్ కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. భారత క్రికెటర్లు కూడా అఫ్రీది వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు పాక్ కు చెందిన మరో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ రెండు దేశాల సత్సంబంధాల కోసం యువత కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 70 ఏళ్లుగా మన హక్కులను, పెండింగ్‌లో ఉన్న హామీలను ఎందుకు పరిష్కరించలేకపోయారనే కఠినమైన ప్రశ్నలతో అధికారులను నిలదీయంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఇరుదేశాల ప్రజలు ద్వేషంతో 70 ఏళ్లు జీవించారని, మరో 70 ఏళ్లు ఇలా నివసించడానికి సిద్దంగా ఉన్నారా అని ట్విటర్‌ వేదికగా యువతను ప్రశ్నించాడు.

Posted in Uncategorized

Latest Updates