భారత్, పాక్ సరిహద్దు దగ్గర కొత్త గేట్లు

ఇండియా, పాకిస్తాన్ బోర్డర్  అతారి-వాఘా బోర్డర్ దగ్గర కొత్త గేట్లను అమర్చనున్నారు. ఈనెల చివరలోగా కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజు సాయంత్రం వాఘా సరిహద్దు దగ్గర జాతీయ జెండాలను అవనతం చేస్తారు. ఈ ఈవెంట్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. అయితే పర్యాటకులకు ఆ దృశ్యాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్త గేట్లతో డ్రిల్‌ను మరింత క్లియ‌ర్‌గా చూసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భారత సరిహద్దు దిక్కున కొత్త గ్యాలరీని కూడా ఓపెన్ చేయనున్నారు. 33 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. ఒకేసారి 25 వేల మంది విజిటర్స్.. బీటింగ్ రిట్రీట్ ఈవెంట్‌ను చూడవచ్చన్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates