భారత్ బంద్ 2 : బీహార్, మధ్యప్రదేశ్ లో విధ్వంసాలు

BARAవిద్య, ఉద్యోగ రంగాల్లో కులాల ప్రాతిపదికన కల్పిస్తున్న రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాగంఢ్ రాష్ట్రాల్లో భారత్ బంద్ విధ్వంసాలకు దారి తీసింది. ముఖ్యంగా బీహార్‌ రాష్ట్రంలో ఉద్రిక్తతంగా మారింది. పాట్నా, భోజ్‌పుర్, బెగసారై, లఖిసారై, ముజఫర్‌ పుర్, షేక్‌ పుర, దర్బంగా జిల్లాల్లో రిజర్వేషన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణలకు దిగాయి. 15 మంది గాయపడ్డారు. బీహార్ రాష్ట్రం మీదుగా వెళ్లే రైళ్లను పలు చోట్ల అడ్డుకున్నారు ఆందోళనకారులు. అరా నుంచి బయలుదేరిన రైలును దర్భాంగా దగ్గర నిలిపేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజస్ధాన్‌‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ విధించారు.

ఫేస్ బుక్, వాట్సాప్‌ ద్వారా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ రోజు బంద్‌ పిలుపు ఇవ్వడంతో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. SC/ST యాక్ట్ ని బలహీనపరుస్తున్నారంటూ దళిత సంఘాలు ఏప్రిల్‌ 2న చేపట్టిన భారత్ బంద్ లో 10 మంది చనిపోయారు. మరోవైపు రిజర్వేషన్లకు అనుకూలంగా భారత్ మాతాకీ జై అంటూ రాజస్ధాన్ లో ఆదివారం(ఏప్రిల్-8) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్న ఓ యువకుడు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతూ ఇవాళ చనిపోయాడు.

Posted in Uncategorized

Latest Updates