భారత్ బెటర్: పెరుగుతున్న విదేశీ పేషెంట్లు

General-Medicine-Cochin-Emc దేశీయ వైద్య పర్యాటక రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ట్రీట్ మెంట్ కోసం భారత్ కు వచ్చే విదేశీయుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా నిత్యం బోర్డర్ లో మనతో కయ్యానికి కాలు దువ్వే పాక్ నుంచి కూడా ఎక్కువ మంది తమ మెడికల్ ట్రీట్ మెంట్ కోసమని భారత్ కు వస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2016లో 54 దేశాల నుంచి 2,01,099 లక్షల మంది విదేశీయులు భారత్‌కు మెడికల్ అవసరాల కోసం వచ్చారు. అందులో 1,678 మంది పాకిస్తానీలు, 296 మంది అమెరికన్లు ఉన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుకే వైద్యం లభించడంతో వైద్య పర్యాటక రంగానికి భారత్‌ కీలక గమ్యస్థానంగా మారిందని ఓ బిజినెస్‌ ఛాంబర్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న 3 బిలియన్‌ డాలర్ల వైద్య పర్యాటకం 2020 నాటికి 7 నుంచి 8 బిలియన్‌ డాలర్లుకు వృద్ధి చెందుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 2014లో వీసా విధానాన్ని కూడా సులభతరం చేసింది.  2016లో ఎక్కువగా మెడికల్ వీసాలను బంగ్లాదేశ్‌ వాసులకు ఇచ్చారు. 99,799 మంది బంగ్లావాసులు భారత్ లో వైద్యం చేయించుకున్నారు. తర్వాతి స్థానంలో ఆఫ్గనిస్తాన్ 33,955, ఇరాక్‌ 13,465, ఒమన్‌ 12,227, ఉజ్బెకిస్థాన్‌ 4,420,  నైజీరియా4,359 పాకిస్తాన్ 1,678, అమెరికా 296, బ్రిటన్‌ 370, రష్యా 96, ఆస్ట్రేలియా 75 మంది వైద్య వీసాలు పొందారు. భారత్‌ నుంచి వైద్య సేవలు పొందిన విదేశీ రోగుల సంఖ్య 2012లో 1,71,021, 2013లో 2,36,898, 2014లో 1,84,298, 2015లో 1.90 లక్షలుగా ఉంది.

 

 

Posted in Uncategorized

Latest Updates