భారత్ లో ట్రంప్ టవర్స్ : ఢిల్లీలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్

JUNIఢిల్లీలో పర్యటిస్తున్నారు జూనియర్ డొనాల్డ్ ట్రంప్. త్వరలో భారత్ లో అమెరికా తరహాలో అపార్ట్ మెంట్ లను నిర్మించేందుకు సిధ్ధమైంది ట్రంప్ ఫ్యామిలీ. ఈ రోజు(ఫిబ్రవరి20) ఉదయం ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో సమావేశమయ్యారు జూనియర్ ట్రంప్. భారత్ లో ట్రంప్ టవర్స్ చేపట్టే నిర్మాణాలకు సంబంధించి వారితో చర్చలు జరిపారు జూనియర్ ట్రంప్. ఇటీవల గుర్ గావ్ లో ట్రంప్ టవర్స్ ను నిర్మిస్తున్నామని ప్రకటన వెలువడిన వెంటనే ముందుగానే కోట్ల రూపాయలను చెల్లించి పలువురు వాటిని బుక్ చేసుకొన్నారు. అమెరికాలో ట్రంప్ టవర్స్ కి మంచి పేరుందని, భారత్ లో కూడా మరిన్ని నిర్మాణాలను చేపట్టాలని వారు కోరడంతో వాటిపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ వచ్చారు జూనియర్ ట్రంప్.

Posted in Uncategorized

Latest Updates