భారత్ లో తప్పు చేసింది: గూగుల్ కు భారీ జరిమానా

Google-1ఇంటర్నెట్ దిగ్గజం, ప్రపంచంలోనే నెం.1 ఆన్ లైన్ సెర్చింగ్ గూగుల్ కు భారీ షాక్. భారత్ లో ఆన్ లైన్ సెర్చ్ విషయంలో అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడినందకు రూ.136 కోట్ల భారీ జరిమానాను విధించింది కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. గూగుల్ కు వ్యతిరేకంగా 2012 లో ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్ పై వచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవం ఉందంటూ గురువారం(ఫిబ్రవరి8) 136 కోట్ల రూపాయాల భారీ జరిమానాను గూగుల్ కు విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ ప్రత్రేకమైన సెర్చ్ ఆప్షన్ అన్నది దాని కమర్షయల్ ఫ్లయిట్ యూనిట్ కు తీసుకెళ్తుందని, ఇది పోటీ నిబంధనలకు విరుధ్ధమని కమీషన్ తెలిపింది. అయితే కమీషన్ ఉత్తర్వులను తాము ఇంకా పరిశీలించలేదని, వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates