భారత్ లో నెం.1 : సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ

మధ్యతరగతి భారతీయుల కారు కలలను నెరవేర్చిన మారుతీ సుజుకీ ఓ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల కార్లను తయారుచేసింది మారుతీ సుజుకీ సంస్ధ. భారత్ లో ఇంత పెద్ద స్ధాయిలో కార్లను తయారుచేసిన సంస్థ మరొకటి లేదు. ఈ రికార్డు అందుకోవడానికి మారుతి సుజుకికి 34 ఏళ్ల 6 నెలల సమయం పట్టింది. గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో ఈ రికార్డును అందుకున్నట్లు సోమవారం(జులై-23) కంపెనీ తెలిపింది. ఈ మైలురాయి కంపెనీకి ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని సంస్థ ఎండీ, సీఈవో కెనిచి అయుకవాతెలిపారు. మారుతీ సుజుకీ నుంచి ప్రస్తుతం 16 మోడల్ల కార్లు అందుబాటులో ఉన్నాయి.

డిసెంబర్‌, 1983 లో కార్ల తయారీని ప్రారంభించిన మారుతీ సుజుకీ… మార్చి, 2011 నాటికి కోటికి చేరింది. అయితే ఏడేళ్లలోనే ఆ సంఖ్య రెట్టింపు అయ్యి రెండు కోట్లకు చేరుకుంది. వంద దేశాలకు మారుతి సుజుకి కార్లను ఎగుమతి చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates