భారత్ లో పేదరికంపై ఫోటోలు : నెటిజన్ల విమర్శలతో ఫోటోగ్రాఫర్ క్షమాపణలు

భారత్ లోని పేదవాళ్లు ఆకలితో ఏవిధంగా పోరాడుతున్నారో తెలిపే విధంగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు ఇప్పుడు పెద్ద వివాదాస్పదమయ్యాయి. ఫోటోగ్రాఫర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛారిటీల నుంచి నిధుల దోపిడీకి పావర్టీ పోర్న్ గా ఆ ఫోటోలకు బ్రాండ్ వేశారంటూ విమర్శకులు పెద్ద ఎత్తున కామెంట్లు చేయడంతో మంగళవారం(జులై-24)ఫోటోగ్రాఫర్ ప్రజలకు క్షమాపణ చెప్పాడు.
2011లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని కొంతమంది పేదవాళ్ల ఫోటోలను తీశాడు ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ అలసియో మమో. ఆ ఫోటోలలో… టేబుల్ పై ఉన్న ఫేక్ మీల్స్ ఎదురుగా నిలబడిన పేద చిన్నారులు, పెద్దలు తమ కళ్లను చేతులతో మూసుకున్నారు. ఈ ఫోటోలను వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. వేలాదిమంది ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ యూజర్లు…. డ్రీమింగ్ పుడ్ సిరీస్ అంటూ విమర్శించగా, మరికొందరు పావర్టీ పోర్న్ ఇన్ ప్రొటెస్ట్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇది మొద్దుబారిన చర్య అని, అవేర్ నెస్ ను పెంపొందించడానికి దీనికన్నా మంచి విధానాలున్నాయని, ఓ చిన్న సానుభూతి మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉంటుందని, పేదవాళ్లు గౌరవం లేనివాళ్లు కాదని కామెంట్లు చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై స్పందించిన ఫోటోగ్రాఫర్ అలసియో మమో… ఎంచుకున్న విధానం తప్పు అయ్యి ఉండవచ్చు కానీ, ఆ ఫోటోల ద్వారా పుడ్ ని వేస్ట్ చేయడం పట్ల పాశ్చాత్య దేశాల ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఆలోపచింపజేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.
ప్రతిరోజూ భారతదేశంలో 19.4కోట్ల మంది ఆకలి కడుపులతో నిద్రపోతున్నారని యునైటెడ్ నేషన్స్ పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. 2017 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం…119 దేశాల్లో భారత్ 100వ ర్యాంక్ లో ఉంది. దీన్ని బట్టి భారత్ లో పేదరికం ఏ స్ధాయిలో విలయతాండవం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయిన ఆహారంలో మూడోవంతు… ఎవ్వరూ నోట్లో పెట్టుకోకముందే డస్ట్ బిన్ లోకి వెళ్లిపోతుందని అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్ పుడ్ టాంక్ ప్రెసిడెంట్ డెనియల్లి నైరన్ బర్గ్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates