భారత్ వెలిగిపోతుంది…అభివృద్దిలో కాదు “మీ టూ”లో

భారత్‌ వెలిగిపోతోంది ..ఒకప్పటి బీజేపీ ప్రభుత్వ నినాదం ఇది. ఇప్పుడు భారత్ నిజంగానే వెలిగిపోతుంది. అయితే ఇది అభివృద్దిలో కాదులెండీ..మీ టూ విషయంలో భారత్ వెలిగిపోతుంది. మీ టూ ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తోంది, దాని పరిధి ఎంత వంటి వివరాలతో గూగుల్‌ ఓ త్రీడీ ఇంటరాక్టివ్‌ మ్యాప్‌ ను రూపొందించింది. అక్టోబర్‌- 2017 నుంచి సెర్చింగ్‌, సోషల్‌ మీడియా ట్రెండిం గ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ‘మీటూ రైజింగ్‌’ పేరిట 3డీ విజ్యువలైజేషన్‌ మ్యాప్‌ ను గూగుల్‌ తయారుచేసింది. ఈ మ్యాప్‌ లో మీటూ బాధిత ప్రాంతాలు వెలుగుతూ కనిపిస్తాయి. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వెలుగులు ఉంటే.. అక్కడ మీ టూ అంత ఎక్కువగా ఉన్నట్లు లెక్క. ఇతర దేశాలతో పోలిస్తే ఈ మ్యాప్‌ లో భారత్ ఎక్కువగా వెలిగిపోతుండటం అందరినీ ఆందోళన కలిగిస్తుంది.

బాలీవుడు విలక్షణ నటుడు నానాపటేకర్ పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగికవేధింపుల ఆరోపణలతో భారత్ మీ టూ ఉద్యమం ఊపందుకొంది. ఇప్పుడు మీ టూ భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మీ టూ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భారత్‌ లో ఇది కేవలం మెట్రో నగరాలు, ప్రముఖ పట్టణాలకే పరిమితం కాలేదని.. దేశమంతటా విస్తరించిందని ఈ మ్యాప్‌ చూస్తేనే అర్థమవుతోంది.

Posted in Uncategorized

Latest Updates