భారత్-వెస్టిండీస్ : తొలి టెస్ట్ ఆడే టీమ్ ఇదే..

రాజ్ కోట్ : ఆసియాకప్ ను సొంతం చేసుకుని మంచి జోష్ మీదున్న టీమిండియా మరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకునే పనిలో పడింది. గురువారం (అక్టోబర్-4) నుంచి వెస్టిండీస్ తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే రాజ్ కోట్ చేరుకున్న భారత్..టీమ్ ను అనౌన్స్ చేసింది. తొలిసారి మ్యాచ్ జరగడానికి ఒక రోజు ముందే ఫైనల్ జట్టును ప్రకటించింది టీమిండియా. తొలి టెస్టుకు 12 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించడం విశేషం.

అండర్ 19 స్టార్ పృథ్వీ షా టెస్టు అరంగేట్రం చేయనుండగా.. హైదరాబాద్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్యాట్స్‌ మన్ మయాంక్ అగర్వాల్‌ లకు ఈ టీమ్‌ లో చోటు దక్కలేదు.  టీమ్‌ లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్లకు చోటు కల్పించారు. ఆ లెక్కన తుది జట్టులో స్థానం కోసం పేసర్లు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లండ్‌ తో టెస్ట్ సిరీస్ సమయంలోనూ పృథ్వీ షా టీమ్‌ తోపాటే ఉన్నా.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక ఓవల్‌లో ఇంగ్లండ్‌ తో టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన హనుమ విహారికి పైనల్ టీమ్ లో స్థానం దక్కలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావించడంతో విహారిని పక్కన పెట్టక తప్పలేదు.

తొలి టెస్ట్ ఆడే టీమ్ ఇదే:

విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా (అరంగేట్రం), చెటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.

Posted in Uncategorized

Latest Updates