భారత పెద్ద కరెన్సీ నోట్లను నిషేదించిన నేపాల్

నేపాల్:  ఇండియన్ కరెన్సీలోని పెద్ద నోట్లైన రూ.2000,500,200 పై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ నోట్లను నేపాల్ లో ఉపయోగించకూడదంటూ అక్కడి ప్రభుత్వం అదేశాలు ఇచ్చినట్లు కాఠ్మండు పోస్ట్ తెలిపింది. రూ.100 కంటే ఎక్కువ విలువైన ఇండియన్ కరెన్సీని నేపాల్ లో చట్టబద్ధం చేయనందున ఈ నోట్ల పై నిషేదం విధించినట్లు ఆ దేశ సమాచార,ప్రసార శాఖ మంత్రి తెలిపినట్లు కాఠ్మండు పోస్ట్ చెప్పింది.

మన దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ. 2000, రూ. 500, రూ. 200 విలువైన కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చింది. అప్పటి నుంచి నేపాలీ మార్కెట్‌లోనూ ఈ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా చట్టబద్ధం చేయలేదు. దీంతో ఆ నోట్లను ఉపయోగించడం పై నేపాల్ బ్యాన్ విధించింది.

Posted in Uncategorized

Latest Updates