భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైన్యం

చైనా బలగాలు భారత భూభాగంలోకి మరోసారి చొరబడినట్లు తెలుస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ దగ్గర ఉన్న వాస్తవాధీన రేఖను దాటి చైనా సైన్యం మన భూభాగంలోకి అడుగుపెట్టినట్లు కేంద్ర విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. రెండు దేశాల సైన్యాలు ప్రొటోకాల్‌ ప్రకారం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. చైనా సైనికులు అరుణాచల్‌లోని దిబాంగ్‌ ప్రాంతంలోకి దాదాపు 14కిలోమీటర్లు లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates