భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు గురువారం (ఆగస్టు-2) భారీగా తగ్గాయి. మార్కెట్‌ లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు తగ్గి.. 30 వేల435 రూపాయలుగా ఉంది. లోకల్ మార్కెట్ల నుంచి డిమాండ్‌ పడిపోవటం కూడా ధర తగ్గటానికి మరో కారణం. ఇక కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డ్ అయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది.

అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.65 శాతం పడిపోయింది. ఔన్స్‌ 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30 వేల435, రూ.30 వేల285గా నమోదయ్యాయి.

 

Posted in Uncategorized

Latest Updates