భారీగా పెరగనున్న కాంట్రాక్టు లెక్చరర్ల సాలరీలు

kadiamకాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్. ఏప్రిల్ నెల నుంచి యూనివ‌ర్శిటీ కాంట్రాక్టు ఉద్యోగుల వేత‌నాలు పెర‌గ‌నున్నాయి. దాదాపు 75 శాతం ఆ వేత‌నాలు పెరిగే అవ‌కాశాలున్నాయి. డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి బుధవారం(ఏప్రిల్-18) దీనికి సంబంధించిన జీవోను రిలీజ్ చేశారు. ఆ జీవోను ఆయ‌న కాంట్రాక్టు ఉద్యోగుల‌కు అంద‌జేశారు. జీతాలు పెంచుతూ జారీ చేసిన జీవోను అందుకున్న కాంట్రాక్టు లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 11 వర్శిటీల్లో  సుమారు 1,561 మంది కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు ఈ జీవో ద్వారా మేలు జ‌ర‌గ‌నున్న‌ది. పెరిగిన వేతనాలతో ఫలితాలను పెంచాలని కడియం శ్రీహరి అధ్యాప‌కుల‌కు సూచించారు. ఈ జీవోతో లెక్చ‌రర్ల జీతాలు 24వేల నుంచి సుమారు 47 వేల వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి.

Posted in Uncategorized

Latest Updates