భారీగా పెరిగిన బంగారం ధర

gold--621x414మరికొద్ది రోజుల్లో మూఢం ముగియనుండడంతో పసిడి ధర అమాంతం పెరిగింది. డాలర్ విలువ పడిపోవడంతోపాటు అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉండడంతో గురువారం (ఫిబ్రవరి-15) పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.350 పెరిగి రూ.31 వెయ్యి 650కి చేరుకుంది. త్వరలో రానున్నది పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి.

వెండి కూడా బంగారం బాటలోనే పయనించి కిలోకు రూ.720 పెరిగి రూ.39 వేల 970కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates