భారీగా ప్యాకెట్లు స్వాధీనం : గుట్కా షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు

ED-120618-ADB-GUTKA-VISకొమురం భీం జిల్లా కాగజ్ నగర్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కిరాణ దుకాణాలపై దాడులు చేశారు. కాగజ్ నగర్లో గుట్కా అమ్ముతున్నారనే సమాచారంతో మంగళవారం (జూన్-12) తనిఖీలు చేశారు. ఓ షాపులో లక్ష రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల ఆరోగ్యాలకు హానిచేసే గుట్కాలపై నిషేదం ఉందని, రూల్స్ బ్రేక్ చేసి వ్యాపారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. గుట్టు చప్పుడు కాకుండా అనేక చోట్ల ఈ వ్యాపారం జోరుగా జరుగుతుందని తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎక్కువగా కిరాణ షాపుల్లో, పాన్ షాపుల్లో గుట్కాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారని, దీనిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయలని సూచించారు అధికారులు. గుట్కా అమ్ముతున్నట్లు తెలిస్తే ఎవ్వరికీ భయపడకుండా సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చినవారి పేర్లను సీక్రెట్ గా ఉంచుతామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates