భారీ ఏర్పాట్లు : రేపు కుమారస్వామి ప్రమాణస్వీకారం

Kumaraswamyకర్ణాటకలో బుధవారం (మే-23) కాంగ్రెస్-JDS కూటమి ప్రభుత్వం కొలువదీరనుంది. కూటమి నుంచి సీఎంగా JDS నేత H.D.కుమారస్వామి రేపు ప్రమాణ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

మంత్రి పదవుల పంపకంపై ఈ రోజంతా కాంగ్రెస్, JDS నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ కు చెందిన 22మందికి మంత్రి పదవులివ్వాలని నిర్ణయించారు. JDS నుంచి 12మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే KR రమేష్ కుమార్ ను ఎన్నుకోనున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ తర్వాతే మంత్రుల ప్రమాణం, శాఖల కేటాయింపు జరపనున్నారు.

కుమారస్వామిని అభినందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. బెంగళూరు వెళ్లిన కేసీఆర్… కుమారస్వామి, దేవేగౌడలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలకు ముందు JDSకు మద్దతు తెలిపారు కేసీఆర్. వరుస కార్యక్రమాలు ఉన్నందున రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోతున్నారు కేసీఆర్. అందుకే ఈ సాయంత్రమే బెంగళూరు వెళ్లి… శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, BSP అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ హాజరుకానున్నారు.

Posted in Uncategorized

Latest Updates