భారీ ప్రమాదం : కొచ్చిన్ షిప్ యార్డ్ లో పేలుడు

shipకేరళ రాష్ట్రం కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మరమ్మతుకు వచ్చిన నౌకలో పేలుడుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం ఉదయం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ONGC)కి చెందిన సాగర్‌ భూషణ్‌ నౌకను మరమ్మతుల కోసం కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉంచారు. సిబ్బంది మరమ్మతులు చేస్తున్న సమయంలో షిప్ లో పేలుడు జరిగింది. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు కేరళ వారు. ఫిప్ లో వాటర్‌ ట్యాంక్‌లో ఈ పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పేలుడుపై కేంద్ర రవాణా మంత్రి నితీష్ గడ్కరీ కూడా స్పందించారు. షాకింగ్ న్యూస్ అన్నారు. ప్రమాదంపై వెంటనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.ప్రమాదం దురదృష్టంగా చెప్పారు. షిప్ యార్డ్ ఎండీతో మాట్లాడటం జరిగిందని.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి.

Posted in Uncategorized

Latest Updates