భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ : 250 ఏళ్లు ప్రపంచాన్నే శాసించేలా భారత్

MOONచంద్రుడిపై ట్రిలియన్ డాలర్లు విలువైన న్యూక్లియర్ ఫ్యూయల్ ని వెలికి తీసేందుకు.. ఇస్రో రెడీ అయ్యింది. నాసా ఊహకి అందని.. అద్బుతమైన, సాహసోపేతమైన ప్రయోగానికి రెడీ అవుతోంది ఇస్రో. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా చేయని విధంగా చంద్రుడి దక్షిణ వైపు దృష్టి పెట్టింది. ఆ దిశగా ఇండియా స్పేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కసారి చంద్రుడి దక్షిణవైపు చేరుకుంటే లక్షల కోట్లు విలువ చేసే వేస్ట్-ఫ్రీ న్యూక్లియర్ ఎనర్జీని మైనింగ్ చేసే వీలుంటుందా అనే స్టడీ చేయవచ్చని ఇస్రో ఆలోచన చేస్తుంది. చంద్రుడిపై నుంచి ఏ దేశమైతే ఆ మూలాన్ని భూమిపైకి తీసుకురాగలుగుతుందో… ఆ దేశమే ఈ ప్రాసెస్ ను డిక్టేట్ చేయగలుగుతుందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ కె.శివన్ తెలిపారు. దీన్ని తామే లీడ్ చేయాలనుకుంటున్నట్లు శివన్ తెలిపారు.

అక్టోబర్ లో ఓ రోవర్ ను లాంఛ్ చేయబోతున్నట్లు తెలిపారు. దీని ద్వారా చంద్రుడిపై నీరు, హీలియం-3 జాడలు ఉన్నాయో లేదో విశ్లేషించవచ్చన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. 250 ఏళ్ల వరకూ హీలియం-3 ప్రపంచ దేశాల ఎనర్జీ డిమాండ్స్ ను తీర్చగలదు. దీని విలువ లక్షల కోట్లలో ఉండనుంది. అంతేకాకుండా ఆర్బిట్ లో ఓ స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రుడిపై భారతీయ సిబ్బంది ఉండనున్నారు. అయితే తాము రెడీగా ఉన్నామని.. ప్రభుత్వం ఇంకా టైమ్ ఫ్రేమ్ సెట్ చేయలేదని తెలిపారు. చంద్రుడిపై దక్షిణం వైపు ఉన్న హీలియం-3ని భూమిపైకి తీసుకువచ్చే విధానంపైనా అధ్యయనం జరుగుతుంది. అది ఏ రూపంలో ఉన్నా తీసుకువచ్చేందుకు ఇస్రో సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates