భారీ బందోబస్తు : అంబేద్కర్ విగ్రహాలకు ఫెన్సింగ్

AMBEDKARఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో కొంత మంది చనిపోయారు. ఆ తర్వాత ఉత్తరభారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం కొనసాగుతుంది. దీంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ ఎక్కడో ఓచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విగ్రహాలు విధ్వంసాన్ని అడ్డుకునేందుకు, వాటిని రక్షించేందుకు కొత్త తరహా జాగ్రత్తలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం బింద్ కేరియా గ్రామంలోని  అంబేద్కర్ విగ్రహాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి బందోబస్తు చేస్తున్నారు అధికారులు. వాటికి తాళం కూడా వేస్తున్నారు. ఎప్పడైనా విగ్రహాలకు పూలమాలలు వేయాలంటే.. గ్రామంలోని అధికారికి సమాచారం ఇస్తే వారు వచ్చి తీస్తారు. ఈ బందోబస్తు వల్ల విగ్రహాల విధ్వంశాలను అడ్డుకోవచ్చన్నారు స్థానిక అధికారులు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లోని విగ్రహాల విషయంలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates