సిటీలో భారీ భద్రత : నేడు మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు

Mecca-Masjidహైదరాబాద్ మక్కామసీదులో 2007 మే 18వ తేదీన జరిగిన పేలుళ్ల కేసులో నాంపల్లిలోని NIA కోర్టు సోమవారం (ఏప్రిల్-16) తీర్పు చెప్పనున్నది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులు చర్లపల్లి జైలులో ఉండటంతో జైలు వద్ద అదనపు బలగాలతో భద్రత ఏర్పాటుచేశారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచే విషయంలోనూ జైలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. సున్నిత ప్రాం తాలపై నిఘా పెట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి సున్నిత ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు తెలిపారు శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్. పోలీసులు అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.  ఉగ్రవాదులకు మతం ఉండదని, విధ్యంసం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమే వారి లక్ష్యమని చెప్తూ శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరుతున్నారు పోలీసులు.

2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(IED ) బాంబు పేలడంతో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates