భారీ వర్షం..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో KTK ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. గత 9రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. ఓపెన్ కాస్ట్ గనిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రోజుకు 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు 54వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 13 కోట్ల వరకు నష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు అధికారులు.

గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి సింగరేణి ఏరియాలోని రామకృష్ణాపూర్ ,కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ లలోకి భారిగా వరద నీరు చేరడంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీంతో 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి… 23 కోట్ల నష్టం ఏర్పడిందంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates