భారీ వర్షం: మరోసారి నీట మునిగిన ముంబై

rain
ముంబైని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. వారంలో ఇది రెండోసారి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. లోకల్ ట్రైన్లు అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్కై మేట్ అంచనా వేసింది. అటు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఉధృతి కాస్త తగ్గింది. వరదలు, కొండ చరియలు విరిగిపడడంతో… అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరం, నాగాలండ్ లలో చనిపోయినవారి సంఖ్య 17కు చేరింది. అసోంలో 716 గ్రామాలు నీట మునిగాయి. నాలుగున్నర లక్షల మందిపై ప్రభావం పడింది. మణిపూర్ లో లక్షా 80వేల మందిపై వరదల ప్రభావం ఉంది. త్రిపురలో 40వేల మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. NDRF, SDRF, మిలిటరీ, ఎయిర్ పోర్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో సహాయ చర్యల్లో పాల్గొంది.

Posted in Uncategorized

Latest Updates