భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబై

mpమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై లోని థానే, కళ్యాణ్, నవీ ముంబై, మరికొన్నిఇతర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉల్హాస్ నదిలో నీటి ఉధృతి అమాంతం పెరిగిపోవడంతో కల్యాణ్, మిలాప్ నగర్, దోంబివిలి ప్రాంతాల్లో వరద పోటెత్తింది.

మరోవైపు నాగ్ పూర్ లోని మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదాపడ్డాయి. రానున్న ఐదు రోజుల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా కొన్నిచోట్ల స్కూళ్లకి సెలవులు ఇచ్చారు. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబై వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత భయంపట్టుకుంది. గడిచిన 24 గంటల్లో ఒక్క థానేలోనే 40 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates