భారీ వర్షాలు : అమర్ నాథ్ యాత్రకు బ్రేక్

amarnath
బుధవారం (జూన్-27) ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర రెండోరోజుకు చేరింది. భారీ వర్షాలతో యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుడారాల్లో యాత్రికులు రెస్ట్ తీసుకుంటున్నారు. వర్షం తగ్గిన తర్వాత యాత్ర తిరిగి మొదలవుతుందని చెప్తున్నారు అధికారులు. రెండు నెలలపాటు సాగే ఈ యాత్రకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి విడత యాత్రలో 3,000 మంది యాత్రికులు జమ్మూ బేస్ క్యాంపు నుంచి అమర్ నాథ్ కు బయలుదేరారు. కశ్మీర్ పోలీసులతోపాటు పారామిలటరీ, NDRF, సైన్యంతో కలిపి మొత్తం 40వేల మందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates