భారీ వర్షాలు : మృతుల లిస్ట్ విడుదల చేసిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు అతిపెద్ద రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఈ మూడు రోజుల్లోనే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 58మంది చనిపోయారు. మరో 53మంది గాయపడ్డారు. అత్యధికంగా సహరన్ పూర్ జిల్లాలో 11మంది, మీరట్ లో 10 మంది, ఆగ్రాలో ఆరుగురు చనిపోయినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఇవాళ్టి వరకు చనిపోయినవారి లిస్ట్ ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. వీరంతా… వర్షాల కారణంగా వచ్చిన వరదలు, ఇళ్లు కూలడం, భూమికోత లాంటి ఘటనల్లో చనిపోయినట్టుగా యూపీ ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో చాలామంది కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం కూడా అందించామని… మరికొందరికి అందాల్సి ఉందని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates