భారీ సీక్రెట్ ఆపరేషన్ : గూఢచారి చేతి గడియారం దొరికింది

GUDయూదుల గుండెల్లో హీరోగా చోటు దక్కించుకున్న గూఢచారి కోహెన్ చేతి వాచ్ ను చివరికి సంపాదించింది ఇజ్రాయెల్. ఈ వాచ్ కోసం రహస్య ఆపరేషన్ చేపట్టింది ఇజ్రాయెల్. ఏడాదిన్నరపాటు సిరియా రాజధాని డమాస్కస్‌ లో అణువణువూ గాలించి దీన్ని సంపాదించింది. ఈ వాచ్ మన హీరో… ఎలీ కోహెన్ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు.
1957లో యూదుడైన కోహెన్‌ ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొసాద్‌ లో చేరారు. సిరియాపై నిఘా భాధ్యతను కోహెన్ కు అప్పగించారు అధికారులు. అర్జెంటీనా నుంచి వచ్చిన వ్యాపారిగా సిరియా రాజధాని డమాస్కస్ లో కోహెన్ నివసించాడు. విందులు ఏర్పాటు చేయడం, అమ్మాయిలను ఎరగావేయడం వంటి వాటితో సిరియా ఉన్నతాధికారులకు దగ్గరయ్యాడు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని రహస్యంగా మొసాద్‌ కు చేరవేసేవాడు. కోహెన్ ఇచ్చిన సమాచారమే 1967 యుద్ధంలో సిరియా ఓటమికి కారణమైంది. అయితే ఓ టెలిగ్రాఫిక్‌ ట్రాన్స్‌ మీటర్‌ను రహస్యంగా ఉపయోగించడం వల్ల సిరియా సైన్యానికి కోహె దొరికిపోయాడు. 1965 మే 19న కొహెన్ ను చిత్రహింసలు పెట్టి ఉరితీశారు. ఉరి తీసిన తర్వాత కోహెన్ మృతదేహం ఎవరికీ చిక్కకుండా సిరియా ప్రభుత్వం పలుచోట్లకు మారుస్తూ వచ్చింది. దీంతో కోహెన్ డెడ్ బాడీ ఆచూకీ కనిపెట్టేందుకు దశాబ్దాల తరబడి ఇజ్రాయెల్‌ ఆపరేషన్లు చేపడుతూనే ఉంది. చివరక ఇన్నేళ్లకు కోహెన్ చేతి గడియారాన్ని సంపాదించింది. అయితే 50ఏళ్లు గడుస్తున్నా కోహెన్‌ మృతదేహాన్ని గుర్తించలేకపోయామన్న భాధ మాత్రం ఇంకా యూదుల్లో ఉంది.

Posted in Uncategorized

Latest Updates