భారీ స్కోర్ దిశగా భారత్..మంధాన హాఫ్ సెంచరీ

MANDANAటీ20 ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ భారత మహిళల జట్టు బ్యాటింగ్ చేస్తోంది. సీనియర్ బ్యాటర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన ఓపెనర్లుగా బరిలో దిగారు. టాస్ గెలిచిన ఇంగ్లీష్ మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. బ్యాటింగ్ పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారత అమ్మాయిలు జోరుగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో భారీ స్కోర్ దిశగా షాట్స్ ఆడుతున్నారు. ఆరో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన మంధాన 13 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలోనే మంధాన (67) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 108 పరుగులు చేసింది. మంధాన(67), మిథాలీ(36) క్రీజులో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates