భార్యపై కోపం..కన్నబిడ్డలను కడతేర్చిన కసాయి

CHILDకట్టుకున్న భార్యపై అనుమానంతో ఇద్దరు కన్నబిడ్డలను కడతేర్చాడో కసాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టులో ఈ దారుణం జరిగింది. దుబ్బతిమ్మాయపల్లి గుట్టల్లో ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపేశాడు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం శివపూర్ గ్రామానికి చెందిన అశోక్… భార్య, ఇద్దరు కూతుళ్లను గొంతుపిసికి హత్యాయత్నం చేశాడు. వీరిలో ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. ఈ ఘటనలో భార్య ప్రాణాపాయం నుంచి బయటపడింది. చనిపోయిన వారిలో పెద్ద పాప అంజలి వయస్సు ఐదేళ్లు కాగా, చిన్న కూతురు అఖిత వయస్సు మూడేళ్లు. నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల పోలీసులు తిమ్మాయపల్లి గుట్టల్లో గాలించారు. అక్కడ అఖిత మృతదేహం దొరికింది. అంజలి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో రాత్రి గాలింపు చర్యలకు ఇబ్బంది కలిగింది.

అశోక్..తన భార్యా పిల్లలతో కలిసి శనివారం సాయంత్రం కొండగట్టుకు వచ్చాడు. అక్కడ రాత్రి సత్రంలో ఉన్న దంపతులు ఆదివారం ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ పిల్లలు అంజలి, అఖిత గొంతు పిసికి చంపేశాడు అశోక్. పిల్లల అరుపులు విని బయటకు వచ్చిన భార్య గొంతు కూడా పిసికేందకు యత్నించాడు. స్పృహ తప్పి పోయిన ఆమె కూడా చనిపోయిందని భావించిన అశోక్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అశోక్ భార్య. ఆమెపై అనుమానంతోనే పిల్లలను చంపేశాడని భావిస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates