భార్యాపిల్లలను కొట్టి ఇంటికి నిప్పు.. తాగుబోతు భర్త వీరంగం

సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాగుబోతు భర్త చెలరేగిపోయాడు. తాగిన మత్తులోనే భార్య, బిడ్డను కొట్టాడు.. ఆ తర్వాత కోపంతో ఇంటికి నిప్పుపెట్టాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత అతడు పారిపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన జరిగింది.

సాయినాథపురంలో భార్యాపిల్లలతో ఉంటున్నాడు రవి. అతడో తాగుబోతు. ప్రతిరోజు తాగొచ్చి భార్యను హింసించేవాడు. ఆదివారం రోజున కూడా తాగొచ్చి భార్య, బిడ్డను తీవ్రంగా కొట్టాడు. ఇంట్లో భర్తతో ఘర్షణ తర్వాత… ఆదివారం సాయంత్రం భార్య, బిడ్డతో కలిసి దమ్మాయిగూడలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యమీద కోపంతో మళ్లీ రాత్రి వేళ కూడా తప్పతాగి వచ్చాడు భర్త రవి. తాగిన మైకంలోనే ఇంటికి నిప్పు పెట్టాడు దుర్మార్గుడు. ఇంటినుండి పొగలు రావడంతో చుట్టు పక్కల స్థానికులు టెన్షన్ పడ్డారు. ఫైర్ డిపార్టుమెంట్ కు ఫోన్ చేసినప్పటికీ ఆలస్యం కావడంతో.. కొంతమంది దైర్యంతో ఇంట్లోకి వెళ్లారు. మంటలపై నీళ్లు చల్లారు. గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకొచ్చి ప్రమాద తీవ్రత తగ్గించారు. వస్తువులను తీసుకొచ్చి బయటపెట్టారు. ఇంటికి నిప్పుపెట్టిన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates