భార్య కోసం..600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

600 KMభార్య కోసం ఓ భర్త సైకిల్ యాత్ర చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తప్పిపోవడంతో ఆమెను వెతుక్కుంటూ సైకిల్ పై ఏకంగా 6వందల కిలో మీటర్లు ప్రయాణించాడు. జార్ఖండ్ కు చెందిన మనోహర్ నాయక్ కు పశ్చిమ బెంగాల్‌లోని కుమ్రాసోల్‌కు చెందిన అనితతో పెళ్లి జరింది. సంక్రాంతి పండుగ  జరుపుకునేందుకు అనిత తన సొంతూరు కుమ్రాసోల్ కు జనవరిలో వెళ్లింది. అయితే పండుగ తర్వాత రెండు రోజులైనా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన మనోహర్ నాయక్ ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో భార్య కోసం సైకిల్ పై వెతుక్కుంటూ రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున 24 రోజుల పాటు 600 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మొదట భార్య సొంత ఊరుకి వెల్లాడు..అక్కడ కన్పించకపోవడంతో సైకిల్ పై తిరుగుతూ ఆమెను వెతకడం మొదలు పెట్టాడు. మొత్తంగా 65 గ్రామాలను సైకిల్ పై తిరిగాడు. చివరకు ఆమె ఫొటోను పేపర్లో ప్రచురించాడు. నాయక్ కు పోలీసులు సహకరించడంతో చివరకు ఖరగ్ పూర్ లో ఉన్నట్లు కనుగొన్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates