భార్య, గర్ల్ ఫ్రెండ్ విషయంలో బీసీసీఐ కొత్త రూల్

భారత క్రికెటర్లు విదేశీ పర్యటనలు చేసే సమయంలో వారి భార్య, గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ఈ నిబంధనలపై ఆంక్షలు విధించింది బీసీసీఐ. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. క్రికెటర్లు విదేశీ టూర్లకు ఒంటరి బయలుదేరి వెళ్లాలి. టూర్ లో ఫస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన 15 రోజుల తర్వాతనే కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారు. అలా వచ్చేసి అక్కడే ఉండిపోతాం అంటే ఒప్పుకోరు. కేవలం రెండు వారాలు అంటే 14 రోజులు మాత్రం భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత తిరిగి స్వదేశం వచ్చేయాలి. ఇటీవల కాలంలో క్రికెటర్లు ఆటపై కంటే.. విదేశాల్లో షికార్లకే ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారని.. గెలుపోటములు అస్సలు పట్టటం లేదనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే విదేశీ పర్యటనకు వెళ్లి భారత జట్టులోని సభ్యుల కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఇంగ్లాండ్ పర్యటన నుంచే అమలు చేయాలని యోచిస్తుంది. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లకు భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ను దూరంగా ఉంచాలని ఇప్పటికే బీసీసీఐ ఆదేశించింది. ఇక వచ్చే విదేశీ పర్యటన నుంచి కొత్త రూల్స్ అధికారికంగా అమల్లోకి వస్తాయి.

Posted in Uncategorized

Latest Updates