భార్య బాధితుల వెరైటీ నిరసన…శూర్పనఖ దిష్ఠి బొమ్మ దగ్ధం

దేశవ్యాప్తంగా దసరా పండుగ రోజు రావణాసురుడి దిష్ఠి బొమ్మలు దగ్ధం చేయడం ఆనవాయితీ. అయితే కొంచెం వైరటీగా మహారాష్ట్రలో రావణాసురిడి సోదరి శూర్పనఖ  దిష్ఠి బొమ్మను దహనం చేశారు. ఔరంగాబాద్‌ లోని కరోలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

భార్యల వల్ల పడుతున్న అగచాట్లను తెలియజేయడం కోసమే ఇలా చేసినట్లు పత్ని పీడిత్‌ పురుష్‌ సంఘటన(భార్య బాధితుల సంఘం) సభకు చెందిన సభ్యులు ఈ పని చేశారు. మన దేశంలో చట్టాలన్ని మహిళలకే అనుకూలంగా ఉన్నాయని, వీటిని అడ్డు పెట్టుకుని భార్యలు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాము, భార్యల వేధింపులకు గుర్తుగా శూర్పనఖ దిష్టి బొమ్మను దహనం చేసినట్లు వారు అని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates